ఆ భయం జగన్ రెడ్డి గారిని వెంటాడుతోంది : నారా లోకేష్

ఆ భయం జగన్ రెడ్డి గారిని వెంటాడుతోంది : నారా లోకేష్
x
Highlights

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ప్రభుత్వంపై...

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ గా ఉన్న కొల్లు రవీంద్ర లాంటి నాయకుడిని అరెస్ట్ చేసి జగన్ రెడ్డి గారు తన మూర్ఖత్వాన్ని, రాక్షస మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. బీసీలకు చేస్తున్న అన్యాయం బయటపడుతుంది అనే భయం జగన్ రెడ్డి గారిని వెంటాడుతోంది.

అందుకే బలమైన బీసి నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారు. అసమర్థ పాలనలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగడుతూ కొల్లు రవీంద్ర పోరాడుతున్నారు. కక్ష సాధింపులో భాగంగా జరిగిన కొల్లు రవీంద్ర గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రజల్ని గాలికొదిలేసి, అధికారాన్ని కేవలం తన కక్ష సాధింపు కోసం వినియోగించుకుంటున్నారు. ఎన్ని సార్లు చివాట్లు తిన్నా జగన్ రెడ్డి గారి బుద్ధి మారడం లేదు అంటూ నారా లోకేష్‌ ట్విట్టర్‌లో మండిపడ్డారు.

మంత్రి పేర్నినాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. గూడురు పోలీస్‌స్టేషన్‌కు రవీంద్రను తరలించిన పోలీసులు కాసేపట్లో ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలకు తీసుకువెళ్లనున్నారు. ఆ తరువాత మెజిస్ట్రేట్ ముందు కొల్లు రవీంద్రను హాజరుపరిచే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories