Devineni Uma: టీడీపీ నేత మాజీమంత్రి దేవినేని ఉమా హౌస్ అరెస్ట్

Devineni Uma: ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో అరెస్టు చేసిన పోలీసులు

Update: 2023-01-05 05:43 GMT

Devineni Uma: టీడీపీ నేత మాజీమంత్రి దేవినేని ఉమా హౌస్ అరెస్ట్

Devineni Uma:  టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో పోలీసులు అరెస్టు చేశారు. దేవినేని ఉమా ‎ఇంటి వద్ద తెల్లవారుజామున పోలీసులు భారీగా మోహరించారు. ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారో తెలియక పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్నారు. కుప్పం ఘటనపై ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలో మాజీ ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్రను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ధూళిపాళ్ల నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గుంటూరు అర్బన్ టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ‌ను కూడా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News