Maganti Babu: శోకసముద్రంలో మాగంటి కుటుంబం
Ex MP Maganti Babu: టీడీపీ హాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు రవీంద్రనాథ్ చౌదరి మరణించారు.
Ex-MP Maganti Babu:(File Image)
Maganti Babu: టీడీపీ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు రవీంద్రనాథ్ చౌదరి అనుమానాస్పద స్థితిలో విగతజీవుడై కనిపించాడు. హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో రవీంద్రనాథ్ చౌదరి రక్తపు వాంతులు చేసుకున్న చనిపోయినట్టు ప్రాథమికంగా గుర్తించారు. రవీంద్రనాథ్ చౌదరి ఇటీవలే ఆసుపత్రిలో చికిత్స పొందగా, ఆసుపత్రి నుంచి మధ్యలోనే ఆయన వచ్చేసినట్టు సమాచారం. అప్పటినుంచి హైదరాబాదులోని స్టార్ హోటల్లోనే ఉంటున్నట్టు తెలుస్తోంది.
కాగా, రవీంద్రనాథ్ చౌదరి మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు చనిపోయాడన్న మరణవార్తతో దిగ్భ్రాంతికి గురైనట్టు వెల్లడించారు. ఇటీవల పెద్ద కొడుకు రాంజీ మరణంతో శోకసంద్రంలో ఉన్న మాగంటి బాబు కుటుంబంలో రవీంద్రనాథ్ మృతి అంతులేని విషాదాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు.