సరైన ఆహ్వానం లేకపోతే ఏమి చేయమంటారు : జేసీ కీలక వ్యాఖ్యలు

సీఎం జగన్ పై ఎప్పుడూ ఒంటికాలుమీద లేచే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. ఈసారి జగన్ ఫ్యామిలీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో జేసీ

Update: 2019-10-28 04:05 GMT

 సీఎం జగన్ పై ఎప్పుడూ ఒంటికాలుమీద లేచే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. ఈసారి జగన్ ఫ్యామిలీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో జేసీ మాట్లాడుతూ.. జగన్ సీఎం అయిన తరువాత ఆయనను కలిసి అభినందించే అవకాశం రాలేదని.. జగన్ ఎదురుపడితే గనక తప్పకుండా అభినందిస్తానని అన్నారు. వైఎస్ కుటుంబంతో తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయన్న జేసీ..

ఎన్నికల ముందు ఒకసారి జగన్ పెద్దమ్మ తనతో మాట్లాడారని.. 'ఎంత పనిచేస్తివన్నా, మీరందరూ దూరమైపోయారు' అని వాళ్ళ పెద్దమ్మ నన్ను అడిగింది.. దానికి నేను.. జగన్ నుంచి సరైన ఆహ్వానం లేకపోతే నన్నేం చేయమంటావు అని అన్నానన్నారు జేసీ. ఇప్పటికీ జగన్ అన్నా, వైఎస్ కుటుంబ సభ్యులన్నా వ్యక్తిగతంగా తనకు ఎంతో గౌరవం అని స్పష్టం చేశారు. భవిశ్యత్ లో జగన్ కనిపిస్తే కచ్చితంగా మాట్లాడతానని చెప్పారు.

కాగా 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన జేసీ దివాకర్ రెడ్డి.. 2019 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అంతేకాదు టీడీపీకి రాజీనామా చేయలేదు కానీ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు కూడా టీడీపీలో అంత యాక్టీవ్ గా లేరు.. జేసీ ఫ్యామిలీ వైసీపీలో చేరాలని ప్రయత్నాలు చేసినప్పటికీ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి సీఎం జగన్ తో మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News