Chandrababu: తిరువూరు పంచాయితీపై నివేదిక రెడీ.. సాయంత్రం సీఎం చంద్రబాబు ముందుకు రిపోర్ట్

Chandrababu: తిరువూరు పంచాయితీపై నివేదిక రెడీ అయింది. ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు ముందుకు రిపోర్ట్ చేరనుంది.

Update: 2025-11-06 05:47 GMT

Chandrababu: తిరువూరు పంచాయితీపై నివేదిక రెడీ.. సాయంత్రం సీఎం చంద్రబాబు ముందుకు రిపోర్ట్

Chandrababu: తిరువూరు పంచాయితీపై నివేదిక రెడీ అయింది. ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు ముందుకు రిపోర్ట్ చేరనుంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్నితో క్రమశిక్షణా కమిటీ భేటీ అయింది. ఇద్దరు నేతల నుంచి విడివిడిగా వివరణ తీసుకున్న కమిటీ.. చిన్నిపై ఆరోపణలకు ఆధారాలున్నాయా అంటూ కొలికపూడిని ప్రశ్నించింది. అయితే.. వాళ్లు వీళ్లు చెప్పినవి, సోషల్‌ మీడియాలో వచ్చినవే చెప్పానని కమిటీకి వివరణ ఇచ్చారు కొలికపూడి.

ఇద్దరి నుంచి తీసుకున్న వివరాలతో రిపోర్ట్ రెడీ చేసిన టీడీపీ క్రమశిక్షణ కమిటీ.. ఇవాళ సీఎం చంద్రబాబుకు ఆ నివేదికను సమర్పించనుంది. చంద్రబాబుకు నివేదిక అందిన తర్వాత వీరిపై చర్యలుండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే.. మరికొంతమందిని కూడా త్వరలో పిలిచి విచారించనుంది టీడీపీ క్రమశిక్షణా కమిటీ. 

Tags:    

Similar News