Andhra Pradesh: ఎస్‌ఈసీ ఇప్పటికైనా స్వతంత్రంగా వ్యవహరించాలి- చంద్రబాబు

Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.

Update: 2021-04-06 13:13 GMT

Andhra Pradesh: ఎస్‌ఈసీ ఇప్పటికైనా స్వతంత్రంగా వ్యవహరించాలి- చంద్రబాబు

Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను తాము బహిష్కరించడం సరైన నిర్ణయమేనని హైకోర్టు తీర్పుతో రుజువైందన్నారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఇచ్చారన్న చంద్రబాబు ఎస్‌ఈసీ ఇప్పటికైనా స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు. కొత్త నోటిఫికేషన్‌తో పరిషత్‌ ఎన్నికలను నిర్వహించాలని బాబు డిమాండ్ చేశారు.

ఏపీలో పరిషత్‌ ఎన్నికలపై స్టే విధించాలన్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు టీడీపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి జవహర్‌. ఎన్నికల కోడ్‌ 4 వారాలు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని, అది పట్టించుకోకుండా హడావిడిగా ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చారని ఆయన అన్నారు. ఎస్‌ఈసీని ప్రభుత్వం ఓ రబ్బర్‌ స్టాంప్‌గా మార్చిందని ఆరోపించారు జవహర్‌.

Tags:    

Similar News