Andhra Pradesh: ఎన్నికలను బహిష్కరిస్తున్నాం- చంద్రబాబు
Andhra Pradesh: స్థానిక ఎన్నికలు రాజ్యాంగ బద్ధంగా జరగలేదని తప్పుబట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Andhra Pradesh: ఎన్నికలను బహిష్కరిస్తున్నాం- చంద్రబాబు
Andhra Pradesh: స్థానిక ఎన్నికలు రాజ్యాంగ బద్ధంగా జరగలేదని తప్పుబట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికలకు ముందే సీఎం, మంత్రులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని, నిబంధనలు పక్కనపెట్టి ఎన్నికలు జరుపుతున్నారని దుయ్యబట్టారు. తాజా పరిస్థితుల్ని చూస్తుంటే కఠిన నిర్ణయాలు తప్పట్లేదని చెప్పారు. కొత్త ఎస్‌ఈసీ వచ్చీ రాగానే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని ఆక్షేపించారు. ఇప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎన్నికలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదన్నారు. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.