Swarna Palace fire Accident case Updates: కస్టడీ పిటిష‌న్‌ పై నేడు విచారణ

Swarna Palace fire Accident case Updates: విజయవాడ హోటల్ అగ్ని ప్రమాదానికి భాద్యులైన వారిని కస్టడీకి తీసుకునే విషయంలో నేడు కోర్డు విచారణ జరపనుంది. వీరితో పాటు వీరి భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకునే విధంగా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

Update: 2020-08-17 05:38 GMT

Swarna Palace fire Accident case Updates: విజయవాడ హోటల్ అగ్ని ప్రమాదానికి భాద్యులైన వారిని కస్టడీకి తీసుకునే విషయంలో నేడు కోర్డు విచారణ జరపనుంది. వీరితో పాటు వీరి భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకునే విధంగా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

అగ్నిప్రమాదం లో పది మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయిన కేసులో నిందితుల కస్టడీ పిటీషన్ పై నేడు కోర్టు విచారణ జరపనుంది. కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న రమేష్ ఆసుపత్రికి చెందిన కీలక వ్యక్తులు జైలులో ఉన్న రమేష్ ఆసుపత్రి సీ ఓఓ రాజగోపాల్, జనరల్ మేనేజర్ సుదర్శన్, కోఆర్డినేటర్ వెంకటేష్ కస్టడీకి పోలీసులు పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ స్వర్ణపాలెస్ హోటల్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని పిటీషన్‌లో పేర్కొన్నారు.

ముగ్గురు నుంచి కీలక సాక్ష్యాలు రాబట్టాలని పిటీషన్లో పోలీసులు కోరారు.పోలీసులు కస్టడీ పిటీషన్ పై మూడవ అదనపు మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు నేడు విచారించనుంది. కస్టడీ నుంచి తప్పించుకునేందుకు బెయిల్ కి ప్రయత్నిస్తున్న నిందితులు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలపనున్నారు. రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం వల్లే పదిమంది ప్రాణాలు పోయాయని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు స్పష్టం చేశారు.

విజయవాడలో పదిమంది కరోనా బాధితుల మృతికి కారణమైన రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం నిర్వాకంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆస్పత్రి భాగస్వామ్యసంస్థలను కూడా విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు రమేష్‌ ఆస్పత్రిలో ప్రధాన వాటాదారుగా ఉన్న ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ యాజమాన్యానికి 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. దుబాయ్‌ కేంద్రంగా ఆస్టర్‌ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

రూ.250 కోట్ల పెట్టుబడులు!

► కేరళకు చెందిన డాక్టర్‌ అజాద్‌ మూపెన్‌ ఫౌండర్‌ చైర్మన్, ఎండీగా దుబాయ్‌లో 1987లో 'ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌' సంస్థను ప్రారంభించారు. రమేష్‌ హాస్పిటల్స్‌లో 51 శాతం వాటా కింద ఆస్టర్‌ సుమారు రూ. 250 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఒంగోలు, గుంటూరు, విజయవాడలోని ఆస్పత్రుల్లో ఈ సంస్థకు వాటాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రమేష్‌ హాస్పిటల్స్‌ వాటాదారైన 'ఆస్టర్‌' సంస్థకు కూడా నోటీసులు జారీ చేసి వివరాలు సేకరిస్తామని ఏసీపీ సూర్యచంద్రరావు తెలిపారు.

మూడు రాష్ట్రాల్లో గాలింపు..

► ఘటన అనంతరం రమేష్‌ హాస్పిటల్‌ సీవోవో, జీఎం, మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రి అధినేత డాక్టర్‌ రమేష్‌బాబు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా అప్పటికే పరారైనట్లు గుర్తించారు. స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌ యజమాని ముత్తవరపు శ్రీనివాసబాబు సైతం పరారు కావడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు.

Tags:    

Similar News