Supreme Court: రఘురామ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
Supreme Court: రఘురామ కృష్ణ రాజు బెయుల్ పిటీషన్ సుప్రీంకోర్టు లో నేడు విచారణ జరపనుంది.
Supreme Court: రఘురామ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ
Supreme Court: రఘురామ కృష్ణ రాజు బెయుల్ పిటీషన్ సుప్రీంకోర్టు లో నేడు విచారణ జరపనుంది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు రఘురామ కృష్ణ రాజు దాఖలు చేసిన ఎస్.ఎల్.పి తో పాటు, ఆయన కుమారుడు దాఖలు చేసిన మరో పిటీషన్ కూడా సుప్రీంకోర్టు లో విచారణకు రానుంది. సుప్రీంకోర్టులో సోమవారంనాటి విచారణాంశాల జాబితాలో ఈ రెండు పిటిషన్లూ ఉన్నాయి. జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల వెకేషన్ బెంచ్ దీనిపై విచారణ జరపనుంది.
రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ సీఐడీ అధికారులు ఎంపీ రఘురామను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా ఉన్నత న్యాయస్థానం కిందికోర్టుకు వెళ్లమని సూచించింది. కాగా జిల్లా కోర్టు ఆయనకు 12 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఎంపీ తరఫు న్యాయవాదులు శనివారం రాత్రి సుప్రీంలో బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.