ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Update: 2020-08-26 07:27 GMT

Supreme Court refuses to interfere in Andhra High Court's ruling on three capital bill: ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ , జస్టిస్‌ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను తోసిపుచ్చింది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. సాధ్యమైనంత త్వరగా కేసు విచారణను ముగించాలని హైకోర్టు కు సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు రేపు ఏపీ హైకోర్టులో ఈ కేసును విచారించబోతున్నారు.

Tags:    

Similar News