రేపటి నుండి ఉరవకొండలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవాలు

పట్టణంలోని చెరువుకట్ట సమీపంలో ఉన్న పురాతన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈనెల 29 నుండి 03 వ తేది వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవాలు జరగనున్నాయి.

Update: 2019-11-28 12:11 GMT

ఉరవకొండ: పట్టణంలోని చెరువుకట్ట సమీపంలో ఉన్న పురాతన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈనెల 29 నుండి 03 వ తేది వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవాలు జరగనున్నాయి. 29 శుక్రవారం ఉదయం స్వామివారికి వివిధ రకాల ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సాయంత్రం ఆశ్లేషబలి, అంకురార్పణ ధ్వజారోహణం జరగనున్నాయి.

30న తేదీ  శనివారం ఉదయం లక్ష్మీ నారాయణ హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం, సాయంత్రం వాక్ నిచ్చితార్థం తదితర పూజలు,01 ఆదివారం నాడు ఉదయం 108 లీటర్ల పాలతో శత రుద్రాభిషేకం, సాయంత్రం లగ్న పత్రిక తదితర పూజలు,02 వ తేది సోమవారం ఉదయం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణం.సాయంత్రం గ్రామోత్సవం, ఉయ్యాల సేవ,శయణోత్సవం,03 వ తేదీ మంగళవారం వసంతోత్సవం, ధ్వజా అవరోహణం కార్యక్రమాలు ఈ నెల 29 నుండి డిసెంబర్ 3 వతేదీ వరకు జరుగునన్ని ఈవో క్రిష్ణయ్య తెలిపారు. 

Tags:    

Similar News