Anantapur: అనంతపురం జిల్లాలో వీధికుక్క దాడిలో 4 ఏళ్ల బాలుడికి గాయాలు

Anantapur: చికిత్స కోసం ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు

Update: 2023-04-12 08:15 GMT

Anantapur: అనంతపురం జిల్లాలో వీధికుక్క దాడిలో 4 ఏళ్ల బాలుడికి గాయాలు 

Anantapur: తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల ధాటికి జనం హడలిపోతున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రజలు వీధి కుక్కలు దాడిలో గాయపాలవుతన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం తాండాలోనూ ఇటువంటి సంఘటనే జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మొహం, చేతులు, కాళ్లపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో బాలుడిని తల్లిదండ్రులు చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News