Srireddy to Nara Lokesh: లోకేష్ అన్నా నన్ను క్షమించు.. శ్రీరెడ్డి బహిరంగ లేఖ
Srireddy to Lokesh: లోకేష్ అన్న నన్ను క్షమించండి అని కోరుతూ నటి శ్రీరెడ్డి మంత్రి లోకేష్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు.
Srireddy to Lokesh
Srireddy to Lokesh: లోకేష్ అన్న నన్ను క్షమించండి అని కోరుతూ నటి శ్రీరెడ్డి మంత్రి లోకేష్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్‌కు, ఆయన సతీమణి భారతిని ఉద్దేశించి కూడా శ్రీరెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు. వేర్వేరుగా రాసిన ఈ బహిరంగ లేఖలను ఆమె తన ఎక్స్ ఖాతా ద్వారా నెటిజెన్స్‌తో షేర్ చేసుకున్నారు. మంత్రి లోకేష్‌కు రాసిన బహిరంగ లేఖ విషయానికొస్తే... చంద్రబాబు నాయుడును, ఆయన కుటుంబసభ్యులను దూషించింనందుకు క్షమాపణలు చెబుతున్నట్లు ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంస్థలు, అనుబంధ మీడియా సంస్థలకు తాను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.
తన జుగుస్పాకరమైన బాషతో విమర్శలు చేసి మీ మనసులు ఎంతగా నొప్పించానో ఇప్పుడే అర్థమవుతోందన్నారు. ఏదైనా తన దాకా వస్తే కానీ తెలియదనే విషయం తనకు కూడా ఇప్పుడే అర్థమైందని అన్నారు. గత వారం రోజులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో తన గురించి చేస్తోన్న కామెంట్స్, పోస్టులు తనను ఎంతగానో మనోవేధనకు గురిచేశాయన్నారు. టీడీపీ నేతలు, అభిమానులు సోషల్ మీడియాలో తన గురించి చేస్తోన్న పోస్టులు, కామెంట్స్ చూసి తాను నిద్రాహారాలు కూడా మానేశానని తెలిపారు. ఇదంతా జరిగాకే తాను ఎంత తప్పు చేశానో, మిమ్మల్ని ఎంత బాధపెట్టానో తెలిసొచ్చిందని శ్రీరెడ్డి తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖలో ఆమె ఇంకా ఏమేం రాశారో మీరే చూడండి.
శ్రీరెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతిని ఉద్దేశించి రాసిన మరో బహిరంగ లేఖ