Special Trains to Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. సికింద్రాబాద్‌–తిరుపతి రూట్‌లో ప్రత్యేక సర్వీసులు!

తిరుపతి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే పెద్ద నిర్ణయం తీసుకుంది. శ్రావణమాసం, వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో సికింద్రాబాద్–తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది.

Update: 2025-08-17 13:00 GMT

Special Trains to Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. సికింద్రాబాద్‌–తిరుపతి రూట్‌లో ప్రత్యేక సర్వీసులు!

తిరుపతి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే పెద్ద నిర్ణయం తీసుకుంది. శ్రావణమాసం, వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో సికింద్రాబాద్–తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు ఆదివారం, సోమవారం (ఆగస్టు 17, 18) తేదీల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు.

ప్రత్యేక రైళ్ల వివరాలు:

తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు (07097) ఆదివారం బయలుదేరుతుంది.

సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు ప్రత్యేక రైలు (07098) సోమవారం నడుస్తుంది.

ఈ రైళ్లలో ఫస్ట్ క్లాస్ AC, 2AC, 3AC, ఎకానమీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు.

ఆగే స్టేషన్లు:

రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్ స్టేషన్లలో ఈ ప్రత్యేక రైళ్లు ఆగుతాయి.

భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Tags:    

Similar News