అంధకారాన్ని జయించిన అన్నదమ్ములు..ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న బ్రదర్స్

Update: 2019-08-02 11:19 GMT

లక్ష్యాన్ని సాధించాలన్న తపన అంధకారాన్ని జయించిన ధైర్యం లోపాన్ని శాపంలా భావించని తత్వం సంకల్పంతో ముందుకెళ్లే గుణం పుట్టుకతో జీవితం అంధకారమైనా బంగారు భవిష్యత్తు కోసం ముందడుగేస్తున్న విశాఖ బ్లైండ్ బ్రదర్స్ పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

విశాఖజిల్లా అనకాపల్లి, నర్శింగరావు పేట‌కు చెందిన బాదంపూడి వెంకటరమణ, లక్ష్మీ దంపతులకు ఇద్దరు పిల్లలు. నాగేశ్వరావు, సంతోష్‌. ఈ ఇద్దరు అన్నదమ్ములూ పుట్టుకతో అంధులు. వెంకటరమణ దంపతులది నిరుపేద కుటుంబమైనా. తమ పిల్లలు అంధులైనా వారిని కష్టపడి చదివించారు నాగేశ్వరావు, సంతోష్ లు కూడా కష్టపడి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నాగేశ్వరావు, సంతోష్‌లు పట్టాబద్రులైనా వారు అంధులు కావడంతో ఉపాది దొరకడం లేదు. దీంతో ఉద్యోగాలు లేక ఉపాధి దొరకక వారు చిన్న బట్టికొట్టు పొట్టుకొని జీవనం సాగిస్తున్నారు. తమకు ఎవరైనా ఉద్యోగం కల్పిస్తే కష్టపడి పనిచేస్తామని అడుగుతున్నారు బ్లైండ్ బ్రదర్స్.

మరోవైపు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తుపై బెంగ పెట్టుకుంటున్నారు. తమకు వయసు అయిపోవడంతో వారి బతుకుతెరువు ఎలా ఉంటుందో అని తల్లడిల్లిపోతున్నారు. తమకు ఓపిక ఉన్నంతవరకు వారిని చూసుకుంటామని తరువాత ఆ ఇద్దరూ ఎలా బతుకుతారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన పిల్లలకు ఉపాధి మార్గాన్ని ఎవరైనా చూపించాలని కోరుకుంటున్నారు. అంధత్వాన్ని జయించిన ఈ అన్నదమ్ములకు ఉపాధి అవకాశాలు అంది వారి భవిష్యత్తు బంగారం మయం కావాలి మనసున్న మారాజులు ఎవరైనా చేయి అందించాలని ఆశిద్దాం.

Full View

Tags:    

Similar News