Special Story On Burrilanka Sand Mafia : అక్రమాల పుట్టగా తూర్పు గోదావరి జిల్లా బుర్రిలంక ఇసుకర్యాంపు

Update: 2020-07-08 06:46 GMT

Special Story On Burrilanka Sand Mafia: నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు ఆమ్యామ్యలతో అక్రమార్కులకు సహకరిస్తున్నారు. ఇసుక ర్యాంపుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలకు అవసరమైన ఇసుక ఇంకా దొరకడం లేదు. అధిక ధరలు ఎవరు చెల్లిస్తే వారికే సరఫరా అవుతున్న పరిస్థితి. ప్రభుత్వ పనులకు కూడా ఇసుక కాంట్రాక్టర్లు ఇసుక సరఫరా చేయడం లేదని ప్రజలు, వైసీపీ నాయకులు సైతం వాపోతున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఇసుక ర్యాంపులల్లో కడియం మండలం బుర్రిలంక ఇసుక ర్యాంపు చాలా పెద్దది. ఇక్కడ కొద్ది రోజుల క్రితమే ఓపెన్‌ రీచ్‌ ప్రారంభించారు. బోట్లు, మనుషుల చేత పనిచేయాల్సివుంది. అయితే మిషన్లు పెట్టి టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. బుర్రిలంక ర్యాంపు నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతుందని వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. అక్రమ మార్గంలో అమ్ముకుంటూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని మండిపడ్డారు.

కడియం మండలంలోని బుర్రిలంక ఇసుక ర్యాంపులో అవినీతి అక్రమాలకు అడ్డులేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికంగ సచివాలయం నుంచి బుక్ చేసుకున్న లారీలకు ఇసుక ఇవ్వడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇష్టారాజ్యంగా ఇసుక తరలించుకుపోతున్న కాంట్రక్టర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

రాత్రి పగలూ తేడా లేకుండా యథేచ్ఛగా నదీ గర్భంలో చొచ్చుకువెళ్లి జేసీబీ యంత్రాలతో లారీలు, ట్రాక్టర్లపై అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని వాపోతున్నారు. ఇలా నిభందనలను కాలరాస్తూ బుర్రిలంక ఇసుకర్యాంపు దళారులకు నైవేద్యంగా మారుతోంది. ఇప్పటికైనా ర్యాంపు నిర్వహణలోను నిబంధనలు అమలు చేయాలని పలువురు కోరుతున్నారు.


Full View


Tags:    

Similar News