Srisailam: శ్రీశైలంలో మూడు రోజులపాటు స్పర్శదర్శనం నిలిపివేత
Srisailam: ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు
Eo Lavanya: శ్రీశైలంలో మూడు రోజులపాటు స్పర్శదర్శనం నిలిపివేత
Srisailam: శ్రీశైలంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారనే ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా నేటి నుంచి వచ్చే సంవత్సరం జనవరి 2వ తేదీ వరకు స్పర్వదర్శనం, గర్భాలయ ఆర్జిత సేవలు తాత్కాలింగా నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈఓ లవన్న తెలిపారు. వచ్చే సంవత్సరం జనవరి 2వ తేదీ నుంచి ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి, అమ్మ వార్లకు ప్రత్యేక ఉత్సవాన్ని కూడా నిర్వహించనున్నామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ మూడు రోజులపాటు సామూహిక అభిషేకాలు, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు పొందిన వారిని కూడా అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని భక్తులు సహకరించాలని కోరారు. జనవరి 2న ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేకువజామున స్వామి, అమ్మ వార్ల ఉత్తర ద్వార దర్శనం మాత్రమే ఉంటుందన్నారు. స్వామి అమ్మ వార్లకు రావణ వాహన సేవ, గ్రామోత్సవం నిర్వహిస్తమన్నారు. స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి, ఉదయం 5 గంటలకు స్వామి వారి ఆలయ ముఖ మండపం నుంచి రావణ వాహనంపై ఆసీనులను చేస్తామన్నారు. ఆది దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులందరికీ ఉదయం 6 గంటల నుంచి దర్శన ఏర్పాట్లు, ఆర్జిత సేవలకు అనుమతి ఇవ్వనున్లట్లు లవన్న తెలిపారు.