ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణ

Update: 2020-08-11 05:58 GMT

somu veerraju takes charge as andhra pradesh bjp president: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆయనను ఆ పార్టీ అధిష్ఠానం ఆ పదవిలో నియమించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్‌లో పలువురు బీజేపీ నేతల మధ్య ఆయన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, బీజేపీ రాష్ట్ర సహాయ ఇంచార్జ్ సునీల్ డియోదర్, మధుకర్ జీ, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు, స్వర్ణపాలెస్ ప్రమాద మృతులకు బీజేపీ నేతలు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ..2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బులు ఇచ్చామని.. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అంటే అందరి జీవితాల్లో వెలుగులు నింపడమే అన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడటమే ప్రధాని మోదీ లక్ష్యమని.. గత, ప్రస్తుత ప్రభుత్వాలు బడి పిల్లలకు పౌష్టికాహారం, గుడ్డు పెట్టించలేకపోయారని విమర్శించారు.

Tags:    

Similar News