Somu Veerraju: ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది
Somu Veerraju: రెండేళ్లుగా రోడ్ల అభివృద్ది కోసం ప్రభుత్వం నిధులు ఖర్చు చేయలేదు- సోము
జనసేనతో కలసి రోడ్ల మరమత్తు పై పోరాడుతామన్న సోము వీర్రాజు (ఫైల్ ఇమేజ్)
Somu Veerraju: ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని సోము వీర్రాజు విమర్శించారు. రెండేళ్లుగా రోడ్ల అభివృద్ది కోసం ప్రభుత్వం నిధులు ఖర్చు చేయలేదని విమర్శించారు. రోడ్ల బాగు కోసం జనసేనతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన ప్రకటించారు.
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీపై జనసేనతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో త్వరలోనే సమావేశం కానున్నట్టుగా సోము వీర్రాజు ప్రకటించారు. రెండు పార్టీల మధ్య చర్చల తర్వాత ఈ స్థానం నుండి ఎవరూ పోటీ చేసే విషయాన్ని ప్రకటించనున్నట్టుగా సోము వీర్రాజు తెలిపారు.