సింగసముద్రం చెరువు పాలపొంగులా ఉప్పొంగుతుంది

Update: 2020-09-23 08:38 GMT

జలం మన దాహం తీరుస్తుంది. జల సోయగం మనల్ని దాసోహం చేసుకుంటుంది. కదిలే కెరటాలు పరుగెట్టే ప్రవాహాలు దూకే జల ధారలను వీక్షిస్తే కేరింతలను వేయింతలను చేస్తాం. అలాంటి అనుభూతిని పొందాలంటే సిరిసిల్ల జిల్లాకు వెళ్లాల్సిందే .

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా నీటి అందాలు కనువిందు చేస్తున్నాయి. కొన్ని రోజులుగా వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ఇక జలపాతాలైతే పాలుపొంగినట్లు పొంగి పొర్లుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఉన్న ఎగువ మానేరు, ఎల్లారెడ్డి పేట మండలంలోని సింగసముద్రం జలసిరులతో సందడి చేస్తున్నాయి. నిజాం కాలంలో నిర్మించిన ఎగువ మానేరు జలాశయం ఇప్పుడు నిండు కుండలా మారి మత్తడి దూకుతోంది. ఇక సింగ సముద్రం చెరువు పాలపొంగులా ఉప్పొంగుతుంది. ఈ అందాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగా తరలిస్తున్నారు.

పర్యాటకులు భారీగా వస్తుండడంతో పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. అయితే కరోనా ప్రబలుతున్న సమయంలో పర్యాటకులు భారీగా వస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వినోదం ప్రమాదం కాకూడదు. కరోనా సమయలో సందడి కోసం వెళ్లి సమస్యలు తెచ్చుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు చెరువుల వద్ద కాస్త జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Full View




Tags:    

Similar News