సింహాచలం ఇన్‌చార్జ్ ప్రధాన అర్చకుడి సస్పెండ్

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పాలకమండలి నియామకంపై టీడీపీ చేసిన ఆరోపణలు మరవక ముందే దేవస్థానంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2020-04-29 03:57 GMT

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పాలకమండలి నియామకంపై టీడీపీ చేసిన ఆరోపణలు మరవక ముందే దేవస్థానంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఇన్‌చార్జి ప్రధాన అర్చకుడిని సస్పెండ్ చేశారు.. ఈ మేరకు ఈవో వెంకటేశ్వరరావు సస్పెండ్ ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి శ్రీనుకు సహకరించారని అనుమానంతో ఆలయ ఇన్‌చార్జి ప్రధాన అర్చకులు గొడవర్తి కృష్ణమాచార్యులను ఈవో సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు.

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవం కార్యక్రమంలో.. ప్రైవేటు వ్యక్తి తిరుపతి శ్రీను ఆలయంలోకి ప్రవేశించాడన్న విషయం హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై సీరియస్ అయిన ఈవో వెంకటేశ్వరరావు దర్యాప్తునకు ఆదేశించారు. తిరుపతి శ్రీను అనే ప్రైవేటు వ్యక్తి దేవస్థానానికి పాలు తీసుకురావడానికి కొండపైకి వచ్చినట్టు ఆలయ సిబ్బంది గుర్తించింది, అనుమతి లేకుండా దేవాలయంలోకి పాలు తీసుకువచ్చారని ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శ్రీనుకు సదరు కృష్ణమాచార్యులు సహకరించారని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయనను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక శ్రీనుపై కూడా చట్టపరంగా చర్యలు చర్యలు తీసుకుంటామని ఈవో స్పష్టం చేశారు.


Tags:    

Similar News