కోవిడ్ కారణంగా సింహాద్రి అప్పన్న ఆలయంలో ప్రత్యక్ష దర్శనాలు రద్దు
Simahdri Appanna Temple: కరోనా కారణంగా దర్శనాలను రద్దు చేసిన ఆలయ చైర్మెన్
Simahdri Appanna Temple: సింహాద్రి అప్పన్న ఆలయంలో ఇక ప్రత్యక్ష దర్శనాలు ఉండబోవన్నారు ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత. కోవిడ్ కారణంగా భక్తులు ఆన్‌లైన్‌లోనే దర్శనాలు, పూజలు చేసుకోవాలని కోరారు. చందనోత్సవం, కళ్యాణంతో పాటు ఇతర సేవలన్నంటినీ ఆన్‌లైన్ ద్వారానే చూసి తరించాలని కోరారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించినట్లు తెలిపారు. భక్తులకు ఆయా సేవలకు తగిన రుసుం చెల్లిస్తే వారి పేర్లతో పూజలు నిర్వహిస్తామని చెప్పారు సంచయిత.