దేవాదాయశాఖ షాపులు స్వాధీనం

నగరంలోని సినిమా రోడ్ నందు గల దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ కోకనాడ అన్నదాన సమాజానికి గంజాం వారి వీధి డోర్ నెంబర్ 26-6-29 లో అన్నపూర్ణ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది.

Update: 2019-12-10 07:03 GMT

కాకినాడ: నగరంలోని సినిమా రోడ్ నందు గల దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ కోకనాడ అన్నదాన సమాజానికి గంజాం వారి వీధి డోర్ నెంబర్ 26-6-29 లో అన్నపూర్ణ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇందులోని షాప్ నెం. ఎఫ్ 14, ఎఫ్ 15 షాపులను అద్దె నిమిత్తం బహిరంగ వేలం లో దక్కించుకున్న లీజు దారులు నాలుగు సంవత్సరముల నుండి అద్దెలు బకాయి వున్నారు. ఈఓ అడబాల శ్రీనివాస్ ఎన్నిసార్లు అడిగినా వారు అద్దె కట్టకుండా ఎగవేస్తూ వచ్చారని ఈఓ తెలిపారు. దీనిపై ఆ శాఖ రాజమహేంద్రవరం ప్రాంతీయ కమిషనర్ భ్రమరాంబ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆ ఉత్తర్వులు మేరకు 1టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఏ ఎస్ ఐ వై ఎస్ నారాయణ, కాకినాడ రెవిన్యూ ఇన్స్పెక్టర్ రవితేజ ,దేవాదాయ శాఖ రాజమ హేంద్రవరం అసిస్టెంట్ కమిషనర్ కె ఎన్ వి డి వి ప్రసాద్ ,కాకినాడ ఇన్స్పెక్టర్ వంగా లేపాక్షి లక్ష్మీ నరసింహ రెడ్డి సమక్షలో సంస్థ కార్యనిర్వహణాధికారి అడ బాల శ్రీనివాస్ పై రెండు షాపుల తాళాలు బద్దలు కొట్టి ,లోపలికి ప్రవేశించి సంస్థ దుకాణములు స్వాధీనం చేసుకున్నారు. త్వరలో వీటికి బహిరంగ వేలం పెడతామని ఈఓ శ్రీనివాస్ వెల్లడించారు. 

Tags:    

Similar News