Giddalur: గిద్దలూరులో దారుణం.. బాత్రూంలో బిడ్డను కని బకెట్లో పెట్టి వెళ్లిన తల్లి

Giddalur: ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి డెలివరీ కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి గర్భిణీ స్త్రీ వచ్చింది.

Update: 2025-09-23 06:29 GMT

Giddalur: ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి డెలివరీ కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి గర్భిణీ స్త్రీ వచ్చింది. అయితే.. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. బాత్‌రూమ్‌లోనే మగ శిశువుకు జన్మనిచ్చింది ఆ తల్లి. డెలివరీ అనంతరం ఆసుపత్రిలోని ఓ బకెట్ లో శిశువుని పడుకోబెట్టిన ఆ తల్లి అక్కడినుంచి వెళ్ళిపోయింది.

శిశువు ఏడుస్తున్న శబ్దాన్ని గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది.. సమయానికి డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో మరో ప్రైవేటు ఆస్పత్రికి శిశువును తరలించారు. శిశువు ఆరోగ్యంగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. దీంతో ఊపిరి పీల్చుకున్న ఆస్పత్రి సిబ్బంది.. పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే.. గర్భణీ స్త్రీ సోమవారం అర్ధరాత్రి ఓ వ్యక్తితో ఆస్పత్రికి వచ్చిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ సాయంతో ఆమెను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఘటనపై పూర్తి విచారణ చేపడతామన్నారు. శిశువును ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగిస్తామని వెల్లడించారు.

Tags:    

Similar News