ఏపీ శాసన మండలి చైర్మన్‌గా షరీఫ్..

Update: 2019-02-07 04:05 GMT

ఏపీ శాసనమండలి చైర్మన్ పదవికి టీడీపీ సీనియర్ నేత ఎంఏ షరీఫ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇవాళ(గురువారం) ఉదయం 11:30 గంటలకు ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ తరువాత షరీఫ్ శాసనమండలి ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటి వరకు శాసనమండలి చైర్మన్‌గా ఉన్న ఎన్ఎండీ ఫరూక్‌ను ఇటీవల మంత్రివర్గంలోకి తీసుకోవడంతో మండలి చైర్మన్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా షరీఫ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఎంఏ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన షరీఫ్ ఎన్టీఆర్ టీడీపీ ప్రారంభించినప్పుడు ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతూ వస్తున్నారు. 

Similar News