AP Weather Report: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. తీవ్ర అల్పపీడనం, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
AP Weather Report: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడుతుందని ఏపీ వాతావరణశాఖ వెల్లడించింది.
AP Weather Report: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. తీవ్ర అల్పపీడనం, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
AP Weather Report: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడుతుందని ఏపీ వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో రేపు, ఎల్లుండి ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ వాయుగుండం ఈనెల 29 నాటికి తమిళనాడు, దక్షిణకోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది.
ఎల్లుండి రాయలసీమ, దక్షిణకోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేసింది. తీరం వెంట 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.