రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్ల ఎంపిక

కనిగిరిలో ఈనెల 28 నుండి 30వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు బాలబాలికల జిల్లా జట్లు ఎంపిక కావడం అభినందనీయమని యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Update: 2019-11-27 05:25 GMT
యలవర్తి శ్రీనివాసరావు, ఖోఖో శిక్షకుడు ఎన్ సుదీర్, మేనేజర్లు అనురాధ, సిహెచ్ పూర్ణ, రాజ్ కుమార్

గుడివాడ: ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈనెల 28 నుండి 30వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు బాలబాలికల జిల్లా జట్లు ఎంపిక కావడం అభినందనీయమని ఖోఖో సంఘం జిల్లా అధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఎస్.పి.ఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ఆయన అభినందించారు. ఖోఖో శిక్షకుడు ఎన్ సుదీర్, మేనేజర్లు అనురాధ, సిహెచ్ పూర్ణ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News