ఏపీ సీఎస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ
*కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు... ప్రభుత్వ వాహనాలు వాడకూడదని ఆదేశం *ప్రైవేట్ వాహనాల్లో వెళ్లినా నేమ్ బోర్డు ఉండొద్దన్న ఎస్ఈసీ
SEC Nimmagadda Another Letter to APCS Adithyanath Das
ఏపీ సీఎస్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ మరో లేఖ రాశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ వాహనాలు వాడకూదని ఆదేశించారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించరాదని సూచించారు. ప్రైవేటే వాహనాల్లో ప్రయాణించే సమయంలోనూ వారి నేమ్ బోర్డులు ఉండవద్దన్నారు.
జిల్లాల్లో పర్యటిస్తున్న ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శ్రీకాకుళం చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకున్న ఎస్ఈసీ అధికారులతో సమావేశం అయ్యారు. మీడియాను అనుమతించకుండానే ఎన్నికలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.