సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్‌కి చుక్కెదురు

Update: 2020-03-18 07:33 GMT

సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్‌కి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంలో ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చింది.ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనిదేనని స్పష్టం చేసిన ధర్మాసనం, తక్షణమే ఎన్నికల కోడ్ ను తొలగించాలని ఆదేశించింది. ఓటర్లను ప్రలోభపెట్టేలా కొత్త పథకాలు ప్రవేశపెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వం ఏవైనా కొత్త ప్రాజెక్టులు, పథకాలు చేపట్టాలంటే ఈసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. 

Tags:    

Similar News