విజయనగరం జిల్లా మెట్టపల్లి గ్రామంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం

AP Scrub Typhus Alert: విజయనగరం జిల్లా మెట్టపల్లి గ్రామంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి మరోసారి కలకలం రేపుతోంది.

Update: 2025-12-01 09:04 GMT

AP Scrub Typhus Alert: విజయనగరం జిల్లా మెట్టపల్లి గ్రామంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి మరోసారి కలకలం రేపుతోంది. రాజేశ్వరి అనే మహిళ ఈ వ్యాధి లక్షణాలతో మృతి చెందడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. వారం క్రితం ఇంటి సమీపంలో నల్లిలాంటి ఓ పురుగు రాజేశ్వరిని కాటేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజుల తర్వాత తీవ్రమైన జ్వరం రావడంతో ఆసుపత్రిలో రక్తపరీక్షలు చేయించగా టైఫాయిడ్‌గా నిర్ధారించారు.

జ్వరం తగ్గిన తర్వాత కూడా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో.. కుటుంబ సభ్యులు రాజేశ్వరిని మరో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ రాజేశ్వరి మృతి చెందింది. పరీక్షల్లో రాజేశ్వరికి స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకినట్లు వైద్య నిపుణులు నిర్ధారించారు. అయితే ఈ విషయం ఇప్పటి వరకు తమ దృష్టికి రాలేదని ఎంహెచ్వో తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News