కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్పులు: ఎమ్మెల్యే

నియోజకవర్గ పరిధిలోని అర్హులైన కార్మికుల పిల్లలు కార్మిక శాఖ అందించే స్కాలర్ షిప్పులు అందుకోవాలని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అన్నారు.

Update: 2020-01-31 11:12 GMT

పొన్నూరు: నియోజకవర్గ పరిధిలోని అర్హులైన కార్మికుల పిల్లలు కార్మిక శాఖ అందించే స్కాలర్ షిప్పులు అందుకోవాలని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అన్నారు. షాపులు, హోటల్స్, సినిమా హాల్స్, పెట్రోల్ బంకులు, వాణిజ్య సంస్థలు, రైస్ మిల్లులులో, ఇతర పరిశ్రమలు, కర్మాగారాలు, మోటారు రవాణా సంస్థలు, సహకార సంస్థలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలలో పని చేయు కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్పులు ఇవ్వబడతాయన్నారు.

2019 ఏప్రిల్ మే నెలలో జరిగిన పరీక్షలలో ఉత్తీర్ణులైన కార్మికుల పిల్లలు అర్హులన్నారు. పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన వారికి రూ.5 వేలు, ఇంజనీరింగ్, మెడిసిన్, బి.యస్.సి, బి.సి.ఏ, ఎం.సి.ఎ, డిప్లమా, ల్యాబ్ టెక్నిషన్స్ కు రూ.10 వేలు ఇవ్వబడుతుందన్నారు. స్కాలర్ షిప్ ల కొరకు కార్మికులు తమ పిల్లల పూర్తి వివరాలతో ఫిబ్రవరి 15 తేదీ లోపు పొన్నూరు లేబర్ ఆఫీసర్ (9492555161) కార్యాలయం వారిని సంప్రదించాలన్నారు.

Tags:    

Similar News