Sanitizer Deaths in Prakasam: కిక్కు కోసం.. శానిటైజ‌ర్ తాగి, ఎనిమిది మంది మృతి

Sanitizer Deaths in Prakasam: ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కురిచేడులో కిక్కు కోసం శానిటైజ‌ర్ తాగి ఏకంగా ఎనిమిది మంది మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌నతో జిల్లాలో సంచ‌ల‌నం రేపుతోంది.

Update: 2020-07-31 06:53 GMT
prakasam

Sanitizer Deaths in Prakasam: ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కురిచేడులో కిక్కు కోసం శానిటైజ‌ర్ తాగి ఏకంగా ఎనిమిది మంది మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌నతో జిల్లాలో సంచ‌ల‌నం రేపుతోంది. వివ‌రాల్లోకెళ్తే.. కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర ఉంటే న‌లుగురు యాచకులు , మరో నలుగురు గ్రామస్తులు మద్యానికి బానిసలయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్ర‌భుత్వం లాక్ డౌన్ విధించిన మద్యం అమ్మ‌కాల‌పై నియంత్ర‌ణ విధించింది. దీంతో మ‌ద్యం ధ‌ర‌లు పెరిగాయి. దీంతో  గ‌త కొద్ది రోజులుగా వారు శానిటైజర్లు సేవిస్తున్నార‌ట‌. గురువారం రాత్రి కడుపులో మంటతో ఓ వ్యక్తి చనిపోయాడు. మరో వ్యక్తి కూడా తీవ్ర అనారోగ్యానికి గురి కావ‌డంతో స్థానికులు  అతడ్ని దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.

ఇటు కురిచేడులోని పీఎస్ ద‌గ్గ‌ర్లో ఉండే రమణయ్య గురువారం ఉదయం శానిటైజర్‌, నాటు సారా కలిపి సేవించ‌డంతో అతడ్ని దర్శి ఆస్పత్రికి తీసుకెళ్లారు. మార్గ మ‌ధ్య‌లోనే మ‌ర‌ణించారు. జిల్లాలో మరో ఐదుగురు ఇలానే చనిపోయినట్లు స‌మాచారం. ఒకే యాచకుల బృందానికి చెందిన వీరంతా వేరు వేరు ప్రాంతాల్లో తిరుగుతూ మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు.

ఈ విషాదంపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ స్పందించారు. ఘ‌టనస్థ‌లాలకు వెళ్లి దర్యాప్తు చేశారు. 10 రోజులుగా శానిటైజ‌ర్ తాగుతున్న‌ట్టు కుటంబ స‌భ్యులు చెప్పార‌నీ ఎస్పీ తెలిపారు. వీరంతా కేవ‌లం శానిటైజ‌ర్ తాగారా.. లేదా కల్తీ మద్యం సేవించ‌రా అనే కోణంలోనూ ద‌ర్యాప్తు చేస్తామని వివ‌రించారు. చుట్టుపక్కల విక్రయిస్తున్న శానిటైజర్స్‌ సీజ్‌ చేసి పరీక్షలకు పంపిస్తామన్నారు. 

Tags:    

Similar News