Cheerala SI Over Action: ఎస్సై ఓవర్ యాక్షన్ తో నిండు ప్రాణం బలి

X
Highlights
Cheerala SI Over Action: Action:ప్రకాశం జిల్లా చీరాల టూటౌన్ ఎస్సై విజయ్ కుమార్ అత్యుత్సాహం యువకుడి ప్రాణాలను బలిగొంది. ఈనెల 18న మాస్క్ లేకుండా తిరుగుతున్నాడని కిరణ్ కుమార్ అనే యువకుడిని ఎస్సై విజయ్ కుమార్ చితకబాదారు.
Arun Chilukuri22 July 2020 7:59 AM GMT
Cheerala SI Over Action:ప్రకాశం జిల్లా చీరాల టూటౌన్ ఎస్సై విజయ్ కుమార్ అత్యుత్సాహం యువకుడి ప్రాణాలను బలిగొంది. ఈనెల 18న మాస్క్ లేకుండా తిరుగుతున్నాడని కిరణ్ కుమార్ అనే యువకుడిని ఎస్సై విజయ్ కుమార్ చితకబాదారు. సదరు యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు గుంటూరు తరలించారు. గుంటూరులో చికిత్స పొందుతూ కిరణ్ కుమార్ మృతి చెందాడు.
అయితే పోలీసులు లాఠీలతో కొట్టారని ఆ దెబ్బల కారణంగానే కిరణ్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కిరణ్ తండ్రి మోహన్‌రావు చీరాలలో రేషన్ డీలర్‌గా పనిచేస్తున్నారు. చీరాల ఎస్‌ఐ విజయ్ కుమార్ అత్యుత్సాహంపై దళిత సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. ఎసై విజయ్ కుమార్‌పై హత్య, ఎస్సీ , ఎస్టీ కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు.
Web Titlecheerala si over action
Next Story