భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

Update: 2019-08-26 02:13 GMT

రాష్ట్రంలో ఇసుక సరఫరాకు ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సిద్ధమవుతోంది. వచ్చేనెల 5వ తేదీనుంచి ఇసుక సరఫరా చెయ్యాలని నిర్ణయించింది. ఎవరు ఇసుక బుక్‌ చేసుకున్నా తక్షణమే సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నూతన శాండ్ పాలసీని తెచ్చింది. మొత్తం 102 ఇసుక రీచ్‌లను 47 షెడ్యూళ్లుగా విభజించి ఒక్కో దానిలో రెండు మూడు రీచ్‌లు ఉండేలా పాలసీ తయారుచేసింది. యార్డులకు ఇసుక పంపేందుకు జిల్లా యూనిట్‌గా టెండర్లు, రివర్స్‌ టెండర్లు నిర్వహించింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 97.82 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది. ఇసుక లేక రెండునెలలుగా ఆగిపోయిన నిర్మాణాలు ఇక వేగం పుంజుకోనున్నాయి. 

Tags:    

Similar News