ఉప్పు -ముప్పు : ఎక్కడ బోరు వేసినా సముద్రపు నీరు

Update: 2019-07-16 07:55 GMT

అది పేరుకే సాగరతీరం..అక్కడ మంచినీటికి గడ్డుపరిస్థితులు నెలకొన్నాయి...భూగర్భ జలాలు అడుగంటాయి.. ఎక్కడ బోరు వేసినా సముద్ర జలాలు ముంచుకు వస్తున్నాయి. అధికారులు తక్షణమే మేల్కొనకపోతే విశాఖ నగరాని మంచి నీటి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. విశాఖ నగరం 24 లక్షల పైబడి జనాబా కల్గి ఉంది. ఈ నగరానికి జలభరోసా ఇచ్చే సంప్రదాయ నీటి వనరులు మాయమవుతున్నాయి. ఒకప్పుడు నగరం పలు ప్రాంతాల్లో చెరువులు, వాగులు, బావులు ఉండవి. క్రమక్రమంగా వర్శాలు తగ్గుముఖం పట్టడంతో జలాలు అడుగంటి పోయయి. భూగర్భ జలాలు మరింత లోతుకు చేరుకున్నాయి. నీటి అవసరాల కోసం నగరంలో ఇష్టానుసారంగా బోర్లు వినియోగిస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో నీటి పొరలు ఆవిరి అయిపోతున్నాయి. ఎక్కడ బోరు వేసినా సముద్రపు నీరు వస్తుంది.

బీమిలి, ఎంవీపీ కాలనీ, సాగర్ నగర్, జోడుగుళ్లపాలెం, వన్ టౌన్, ఆర్కే బీచ్ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉప్పు నీరు వచ్చి చేరింది.మంచినీటి వనరులతో కలిసిపోతుంది. గతంలో ఇక్కడ వంద నుంచి 150 అడుగుల లోతులో బోర్లు వేస్తే మంచినీరు పడేది. ప్రస్తుతం మూడు వందల అడుగులు బోరు వేస్తున్నా నీటి జాడ కనిపించడం లేదు. ఒక వేళ నీరు వచ్చినా లవణ సాంధ్రత భారీగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఒకసారి ఉప్పునీరు వస్తే ఇంకేమీ చేయలేమని తేల్చి చెబుతున్నారు

విశాఖ నగరం చుట్టూ కొండలు, వాగులు ఎక్కువగా ఉండటంతో ఏడాదికి 1200 మిల్లీమీటర్లు సగటు వర్షపాతం నమోదవుతుంది. వర్షపు నీటిని జాగ్రత్తగా నిల్వ చేసుకుంటే దాహార్తి తీరుతుందంటున్నారు పర్యావరణ వేత్తలు. రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సరిపడ నీటి నిల్వలు లేకుండా పోతున్నాయి. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోనట్లయితే భవిష్యత్తులో చెన్నైలో ఎదురవుతున్న నీటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా నీటి సంరక్షణకు చర్యలు తీసుకుని.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టే ప్రయత్నం చేయాలి.. నీటి వినియోగంపై శాస్త్రీయమైన ప్రణాలికలు రూపొందించుకోవాల్సిన అసరం ఎంతైనా ఉంది.    

Full View

Tags:    

Similar News