విద్యార్థులకు శక్తి టీం అవగాహన కార్యక్రమం

ప్యాపిలి మండలం లో విద్యార్థులు ఆకతాయిల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఐ రామలింగయ్య, ఎస్ ఐ మారుతి శంకర్ విద్యార్థులకు సూచించారు.

Update: 2019-11-29 06:03 GMT
సిఐ రామలింగయ్య

డోన్: ప్యాపిలి మండలం లో విద్యార్థులు ఆకతాయిల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఐ రామలింగయ్య, ఎస్ ఐ మారుతి శంకర్ విద్యార్థులకు సూచించారు.స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో శక్తి టీం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం సిఐ మాట్లాడుతూ విద్యార్థినిలు వేధింపులకు గురి చేసే వారి కోసం శక్తిటీం పనిచేస్తుందన్నారు.

పాఠశాలకు వచ్చే సమయంలో లేదా బజారులో ఆకతాయిలు వేధిస్తుంటే వెంటనే 100కు ఫోన్ చేయాలన్నారు. విద్యార్థినులు వాట్సాప్ ఫేస్ బుక్ లో ఎటువంటి పరిస్థితిలోనూ ఇతరులకు తమ వ్యక్తిగత సమాచారం షేర్ చేయకూడదని వారు విద్యార్థులకు సూచించారు.


Tags:    

Similar News