Sake Sailajanath: వైసీపీలో చేరిన శైలజానాథ్
Sake Sailajanath: సాకే శైలజానాథ్ శుక్రవారం వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శైలజానాథ్ మంత్రిగా పనిచేశారు.
Sake Sailajanath: వైసీపీలో చేరిన శైలజానాథ్
Sake Sailajanath: సాకే శైలజానాథ్ శుక్రవారం వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శైలజానాథ్ మంత్రిగా పనిచేశారు. పీసీసీ చీఫ్ గా కూడా ఆయన పనిచేశారు. కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. గత నెలలో ఓ కార్యక్రమంలో జగన్, శైలజానాథ్ కలిశారు. ఈ సమయంలో శైలజానాథ్ ను జగన్ ఆలింగనం చేసుకున్నారు. ఈ పరిణామంతో శైలజానాథ్ వైఎస్ఆర్ సీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా శైలజానాథ్ శుక్రవారం జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగమనల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. ఉమ్మడిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2022 జనవరి నుంచి అదే ఏడాది నవంబర్ 23 వరకు ఆయన పీసీసీ చీఫ్ గా పని చేశారు.
2014 అసెంబ్లీ ఎన్నికలకు శైలజానాథ్ తెలుగుదేశం పార్టీలో చేరుతారని ప్రచారం సాగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడితో ఆయన చర్చలు జరిపారని చర్చ తెరమీదికి వచ్చింది. శింగనమల నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన శమంతకమణి కూతురు యామినిబాలను తెలుగుదేశం పార్టీ బరిలోకి దింపింది. జిల్లాకు చెందిన కొందరు తెలుగుదేశం నాయకులు శైలజానాథ్ చేరికను అప్పట్లో వ్యతిరేకించారనే చర్చ సాగింది. ఆ తర్వాత శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో వైఎస్ఆర్ సీపీలో చేరారు.