Andhra Pradesh: ఎట్టకేలకు 'జమ్మలమడుగు' పంచాయతీకి చెక్.. ఇద్దరికీ చెరో స్థానం!
Andhra Pradesh: ఏడాది క్రితమే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వచ్చారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Jammalamadugu: నియోజకవర్గ విభజన జరిగితే ఇద్దరికీ చెరో స్థానం- సజ్జల
Andhra Pradesh: ఏడాది క్రితమే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వచ్చారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కోవిడ్ తీవ్రమవడంతో జమ్మలమడుగులో క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం ఆలస్యమైందన్నారు. ఈరోజు సీఎం జగన్‌ను రామసుబ్బారెడ్డి కలిశారు. పార్టీలో రామసుబ్బారెడ్డికి సముచిత గౌరవం ఉంటుందని సీఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. సుధీర్‌రెడ్డి కష్టకాలంలో నిలబడి పోరాడి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లో వచ్చే శాసనమండలికి రామసుబ్బారెడ్డి అనుభవాన్ని వాడుకుంటామన్నారు. నియోజకవర్గ విభజన జరిగితే ఇద్దరికీ చెరో స్థానం ఇస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.