Sajjala Ramakrishna Reddy: అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పెన్షన్ అందిస్తున్నాం
Sajjala Ramakrishna Reddy: పెన్షన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.
Sajjala Ramakrishna Reddy: అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పెన్షన్ అందిస్తున్నాం
Sajjala Ramakrishna Reddy: పెన్షన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేదని అయితే వైసీపీ ప్రభుత్వంలో ప్రతీ నెల 1వ తారీఖున పెన్షన్లు అందిస్తున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం మాదే అని అన్నారు. అనర్హులను పూర్తిగా పరిశీలించాకే తొలగిస్తున్నామని చెప్పారు.
టీడీపీ హయాంలో పెన్షన్లు 40-50 లక్షల మందికి మించలేదని తెలిపారు. ఎన్నికలు దగ్గరకొచ్చే సమయంలో హడావుడిగా సంఖ్యను పెంచారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో 61 లక్షల మందికి పైగా అందజేస్తున్నామని తెలిపారు. అర్హులైన వృద్ధులకు సంబంధించి పూర్తి లెక్కలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తే బాబుకు వృద్ధులు గుర్తుకోచ్చేవారని సజ్జల మండిపడ్డారు.