Andhra Pradesh: చంద్రబాబు రెచ్చగొడుతున్నారు- సజ్జల
Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబును మాంత్రికుడితో పోల్చుతూ విమర్శలు గుప్పించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Andhra Pradesh: చంద్రబాబు రెచ్చగొడుతున్నారు- సజ్జల
Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబును మాంత్రికుడితో పోల్చుతూ విమర్శలు గుప్పించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఉద్యోగులను, విద్యార్థులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఆరోపించిన సజ్జల కరోనా సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని హితవు పలికారు. లాక్‌డౌన్ పెడితే రాష్ట్రం మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజలు వ్యాక్సిన్ వేయించుకున్నా జాగ్రత్తలు పాటించాలి. కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు'' అని సజ్జల తెలిపారు.