సజ్జల సంచలన వ్యాఖ్యలు.. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి.. లేదంటే..
Sajjala Ramakrishna Reddy: తెలుగు రాష్ట్రాల విభజనపై సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు.
సజ్జల సంచలన వ్యాఖ్యలు.. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి.. లేదంటే..
Sajjala Ramakrishna Reddy: తెలుగు రాష్ట్రాల విభజనపై సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఏపీని ఉమ్మడి రాష్ట్రం చేస్తే.. ముందుగా స్వాగతించేది వైసీపీయేనని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి పోరాటం చేసింది వైసీపీయేనని, ఉమ్మడి ఏపీగా కలిసి ఉండాలన్నదే ఇప్పటికీ తమ విధానమని చెప్పారు. రాష్ట్ర విభజన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేశారన్న సజ్జల.. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో తమ వాదనలు బలంగా వినిపిస్తామన్నారు. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి.. లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరతామని చెప్పారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముందని అన్నారు సజ్జల. ఇప్పుడు ఈ కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారి తీశాయి.