Sajjala RamaKrishna Reddy: చంద్రబాబు, పవన్‌ల సంసారం చాలా కాలంగా ఉంది

Sajjala RamaKrishna Reddy: చంద్రబాబు, పవన్ మధ్య డీల్ జరిగింది

Update: 2023-01-09 10:44 GMT

Sajjala RamaKrishna Reddy: చంద్రబాబు, పవన్‌ల సంసారం చాలా కాలంగా ఉంది

Sajjala RamaKrishna Reddy: అపవిత్ర అక్రమ సంబంధాన్ని పవిత్రం చెయ్యడం కోసమే చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశాలు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలకు వారి సంబంధం సక్రమమైనదని చెప్పేందుకే ఇరు పార్టీల అధ్యక్షులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా అని అన్నారు. చంద్రబాబు, పవన్ కలయికతో ఆ రెండు సామాజిక వర్గాల మధ్య సఖ్యతకు ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తుందని అన్నారు. చంద్రబాబు యాక్షన్ ప్లాన్‌లో ఎవరి పాత్ర వారు బాగా పోషిస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. వైసీసీ భయపడుతుందని ఆ రెండు పార్టీలు ఊహించుకుంటున్నాయని అన్నారు. చంద్రబాబు పాలనలో ఏం అభివృద్ధి జరిగిందని పవన్ జతకడుతున్నాడని ప్రశ్నించారు. పవన్‌, చంద్రబాబుల మధ్య డీల్ జరిగిందని.. ఎన్నిసీట్లు ఎంత ప్యాకేజ్‌ అనేది వారి భేటీలో మాట్లుడుకున్నారని సజ్జల ఆరోపించారు. ఈ పొత్తుల్లో బీజేపీని కూడా తీసుకొస్తామని పవన్ చెప్తున్నారు అయితే మిగిలింది కమ్యూనిస్ట్‌లే కదా వారు కూడా పొత్తులో కలుస్తారేమో అని అన్నారు. 

Tags:    

Similar News