సోషల్ మీడియా పటిష్టతపై సీఎం జగన్ ఫోకస్.. సజ్జల తనయుడికి బాధ్యతలు..

Social Media Wing: సోషల్ మీడియా పటిష్టతపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు.

Update: 2022-09-13 12:30 GMT

సోషల్ మీడియా పటిష్టతపై సీఎం జగన్ ఫోకస్.. సజ్జల తనయుడికి బాధ్యతలు..

Social Media Wing: సోషల్ మీడియా పటిష్టతపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం జగన్ సోషల్ మీడియాను పటిష్టం చేయటంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇక, సోషల్ మీడియా బాధ్యతలు చూడటానికి తెర మీదకు కొత్త పేరు వచ్చింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. సీఎం జగన్ ఆధ్వర్యంలో భార్గవ్, సోషల్ మీడియా వింగ్ నేతలు భేటీ అయ్యారు. సోషల్ మీడియాతో పాటు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతను ఇప్పటి వరకూ విజయసాయిరెడ్డి చూస్తూ వస్తున్నారు.

2024 ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో విప‌క్షాలు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా మారిపోయాయి. ప్ర‌తి చిన్న అంశంపైనా స్పందిస్తున్న ఈ పార్టీలు వైసీపీకి స‌వాళ్ల మీద స‌వాళ్లు విసురుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వైసీపీ సోష‌ల్ మీడియాను కూడా మ‌రింత యాక్టివేట్ చేయాలని భావించిన జ‌గ‌న్‌ ఆ వింగ్‌కు బార్గ‌వ రెడ్డిని చీఫ్‌గా నియ‌మించారు. భార్గ‌వ రెడ్డి ప్ర‌స్తుతం వైసీపీ మీడియా వింగ్‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Tags:    

Similar News