స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో సహస్ర పద్మహనం

ప్రకాష్ విద్యా సంస్థల ప్రాంగణం నందు విశాఖ శారదాపీఠం అధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో సహస్ర పద్మహనం మహలక్ష్శీ హోమం గురువారం ఘనంగా జరిగింది.

Update: 2019-11-28 09:57 GMT
శ్రీస్వరూపానందేంద స్వామి, ప్రభుత్వ విప్ దాడిశెట్టిరాజా, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, పర్వత ప్రసాద్, పెట్ల ఉమాశంకర్

పాయకరావుపేట:ప్రకాష్ విద్యా సంస్థల ప్రాంగణం నందు విశాఖ శారదాపీఠం అధిపతి శ్రీ స్వరూపానందేంద సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో సహస్ర పద్మహనం మహలక్ష్శీ హోమం గురువారం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా శ్రీస్వరూపానందేంద స్వామి పాద పద్మములకు అష్టోత్తరశత స్వర్ణ నాణెములతో శ్రీప్రకాష్ విద్యాసంస్థల అధిపతులు సీహెచ్ నరసింగరావు దంపతులు, విజయ ప్రకాష్ దంపతులు పూజ చేశారు. అదేవిధంగా సుమారు 2 వేల మందితో లలితా సహాస్ర నామ పారాయణం చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీస్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ.... కార్తీక మాసంపోయి మార్గశిర మాసం వచ్చింది, ఇటువంటి మార్గశిర మాసం అమ్మవారికి చాలా ప్రీతికరం అని అన్నారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అని తెలిపారు. గురువు ఉంటేనే విద్య సార్ధకత అవుతుందన్నారు. గురువు లేకుండా విద్య సంపాదించిన అది మరుపే తప్ప వేరే ఏమి కాదని అన్నారు. మన దేశంలో గురువుకు శిష్యుడుకు అత్యత్తమ సంబంధo కలిగి ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ దాడిశెట్టిరాజా, పాయకరావుపేట, ప్రత్తిపాడు, నర్సీపట్నం ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, పర్వత ప్రసాద్, పెట్ల ఉమాశంకర్, భక్తులు, మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు.


Tags:    

Similar News