Three Capitals in AP: ఏపీ రాజధానిపై హైఓల్టేజ్ వార్..

Update: 2020-08-06 05:01 GMT

Three Capitals in AP: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై పాలిటిక్స్‌ పీక్స్‌కు చేరుకున్నాయి. అధికార, ప్రతిపక్షాల సవాళ్లు రాజకీయ వేడి రేపుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న వైసీపీ వ్యాఖ్యలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. అసెంబ్లీని రద్దు చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామంటూ జగన్‌ సర్కార్‌కు సవాల్ విసిరారు. అసెంబ్లీ రద్దుకు సిద్ధమో కాదో 48 గంటల్లో చెప్పాలంటూ డెడ్‌లైన్ విధించారు.

ఏపీ రాజధానిపై హైఓల్టేజ్ వార్ నడుస్తోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి. అమరావతిపై ప్రేముంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు వెళ్లాలంటూ వైసీపీ సవాల్‌ చేయటంతో రాజీనామాలు కాదు, అసెంబ్లీనే రద్దు చేయండి, ప్రజల్లోనే తేల్చుకుందామంటూ చంద్రబాబు కౌంటరిచ్చారు. ఒకవేళ మళ్లీ వైసీపీ గెలిస్తే రాజధానిపై ఇక మాట్లాడబోమన్నారు. అసెంబ్లీ రద్దుకు సిద్ధమోకాదో చెప్పాలంటూ సీఎం జగన్ కు 48గంటల గడువు ఇచ్చారు.

ఇక చంద్రబాబు సవాల్‌తో ఏపీ మంత్రులు కూడా ఘాటుగానే స్పందించారు. చంద్రబాబుకు అమరావతిపై అంత ప్రేముంటే అక్కడ ఇల్లు ఎందుకు కట్టుకోలేదంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. తాము తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సరైనదో కాదో 2024లో ప్రజలే నిర్ణయిస్తారంటూ అనిల్ కౌంటరిచ్చారు. ఐదేళ్ల పాలనలో ఎన్నో తప్పులు చేసిన చంద్రబాబు ఎందుకు అసెంబ్లీ రద్దు చేయలేదని ప్రశ్నించారు మంత్రి పేర్నినాని. మరోవైపు చంద్రబాబుకు చాలెంజ్ చేసే సామర్థ్యం లేదన్నారు కొడాలి నాని. బై ఎలక్షన్‌లో పోటీ చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా జగన్ ప్రభుత్వానికి సవాలు విసిరారు. గుంటూరు, కృష్ణాజిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News