Sullurpeta: సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం

సిపిఎం కార్యాలయంలో, అమరావతి రాజధానిగా వుంచాలని డిమాండ్ చేస్తూ... రౌండు టేబులు సమావేశం జరిగింది.

Update: 2020-02-05 04:05 GMT

సూళ్ళూరుపేట: సిపిఎం కార్యాలయంలో, అమరావతి రాజధానిగా వుంచాలని డిమాండ్ చేస్తూ... రౌండు టేబులు సమావేశం జరిగింది. సూళ్లూరుపేట వామపక్ష పార్టీలు హాజరై తహసీల్దారు హమీద్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని ప్రాంతాలకు అనువుగా వుండే రాజధాని అమరావతిని తరలించే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రాజధాని అమరావతి భవనంలో ఎలాంటి నిర్మాణం ఖర్చు లేకుండా, 20 సంవత్సరాలు అమరావతిలోనే పాలనా చేసుకోవచ్చన్నారు.

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 2లక్షల అప్పులు భారం ఉందని, రాజకీయ లబ్ధి కోసమే ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. రాజధాని కోసం తమ భూములు ఇచ్చిన రైతులను అరెస్టులు, మహిళలను హింసించడం, తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాలన కేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సాంబశివయ్య, పద్మనాభయ్య, మనోహర్, మునెయ్య, సీపీఐ బాలయ్య, రమణయ్య, సిఐటియు నాయకులు రాజబాబు, పొన్నయ్య శంకరయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News