వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ

పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి అర్థరాత్రి సమయంలో, ఆలయంలో చోరీ జరిగింది.

Update: 2019-11-30 07:57 GMT
దర్యాప్తు చేస్తున్న సి.ఐ రవికిరణ్, మరియు కమిటీ సభ్యులు

కలిగిరి: పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి అర్థరాత్రి సమయంలో, ఆలయంలో చోరీ జరిగింది. స్థానిక దేవస్థాన పూజారి తెలిపిన వివరాలు మేరకు, శనివారం కావడంతో తెల్లవారు జామున 4గంటల సమయంలో, స్వామివారికి పూజలు నిర్వహించడానికి వచ్చినప్పుడు, ఆ సమాయనికే హుండీ పగల కొట్టి, నగదు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన విషయాన్ని గమనించి దేవాలయం కమిటీ సభ్యులుకు, పోలీసులకు సమాచారం తెలియజేశాడు.

పోలీసులు క్లూస్ టీమ్ తో వచ్చి వేలు ముద్రాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సి.ఐ రవికిరణ్ తెలిపారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ... నాలుగు నెలల నుండి హుండీ తీయలేదని, హుండీలో 60 నుండి 70వేల రూపాయల పైన నగదు ఉంటుందన్నీ , అయితే గతంలో కూడా చోరీ జరిగిందని, 2 సంవత్సరాలలో రెండు సార్లు చోరీ జరిగిందని, ప్రధాన రహదారిలో ఉండే ఆలయానీకే రక్షణ లేకుంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆలయాల పరిస్థితి ఏంటని వారు అన్నారు. ఇంత జరుగుతుంటే, పోలీసులు రాత్రుల్లో ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదని స్థానికులు ఆరోపించారు. 



Tags:    

Similar News