Road Accident: మన్యం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
AP News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.
Road Accident: మన్యం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
AP News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కొమరాడ మండలం చొల్లపదం గ్రామం వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మృతులంతా అంటివలస గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో 8 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కునేరు వద్ద తుమ్మలవలసలో పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.