అప్పన్న స్వామి వెండి విక్రయం ద్వారా రూ.3.34 కోట్ల ఆదాయం

సింహాద్రి అప్పన్న స్వామికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన వెండిని విక్రయించడం ద్వారా దేవస్థానానికి ఆదాయం సమకూరినట్లు ఈవో ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు.

Update: 2019-12-01 04:35 GMT
సింహాద్రి అప్పన్న స్వామి

సింహాచలం: సింహాద్రి అప్పన్న స్వామికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన వెండిని విక్రయించడం ద్వారా దేవస్థానానికి రూ.3,34,19,153 ఆదాయం సమకూరినట్లు ఈవో ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. భక్తులు హుండీలలో కానుకల రూపంలో సమర్పించిన వెండి దేవస్థానంలో నిరుపయోగంగా ఉంది.

వస్తు రూపంలో ఉన్న ఈ వెండిని ఇటీవల కరిగించి దిమ్మలుగా తయారు చేయించారు. సుమారు 1009.200 కిలోల వెండి దిమ్మలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎంటీసీ ఇ-వేలం ద్వారా విక్రయానికి పెట్టారు. ఇందులో ఎస్‌కే ఇంపెక్స్‌ అనే సంస్థ అత్యధిక మొత్తానికి దక్కించుకుంది. ఇందుకు సంబంధించి ధ్రువపత్రాలు, వెండి దిమ్మలను ఎంఎంటీసీ అధికారుల సమక్షంలో కొనుగోలు సంస్థ ప్రతినిధులకు ఈవో వెంకటేశ్వరరావు అప్పగించారు.


Tags:    

Similar News