ఎప్పటి కప్పుడు స్పందనలో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించండి

స్పందన కార్యక్రమంలో దాఖలైన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు ఒకటో పట్టణ సీఐ వి.దుర్గారావు తెలిపారు.

Update: 2019-11-30 03:28 GMT
సీఐ వి.దుర్గారావు, ట్రాఫిక్ ఎస్సై ఏవీఎస్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది

గుడివాడ: స్పందన కార్యక్రమంలో దాఖలైన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు ఒకటో పట్టణ సీఐ వి.దుర్గారావు తెలిపారు. ఎన్జీవో హోమ్ లో రాత్రి స్పందనపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పందన కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 83 అర్జీలు దాఖలు కాగా అందులో కేవలం నాలుగు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయన్నారు.

95 శాతం కేసులు పరిష్కారం అయినట్లు వివరించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై టీవీ వెంకటేశ్వరరావు ట్రాఫిక్ ఎస్సై ఏవీఎస్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



Tags:    

Similar News